Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గఢ్వాల్ జిల్లా గూలర్ బజార్ సమీపంలో మంగళవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి వంతెన పైనుంచి దాదాపు 100 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లడంతో(Uttarakhand Bus Accident) 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF), పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లోయలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి, అంబులెన్సుల ద్వారా సమీప ఆస్పత్రులకు తరలించారు. తెహ్రీ జిల్లా కలెక్టర్ నితికా ఖండేల్వాల్, ఎస్పీ శ్వేతా చౌబే సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా, ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Cold Wave In Telangana: రాష్ట్రంన్నీ వణికిస్తున్న చలి తీవ్రత.. 11.7 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. డిసెంబర్ లో మరింతగా.. వాతావరణ శాఖ హెచ్చరిక!
ఇదిలా ఉండగా, సోమవారం రాత్రి రుద్రప్రయాగ్ జిల్లాలోని బాన్సువాడ-మోహన్‌ఖల్ రహదారిపై ఓ బొలెరో వాహనం లోయలో పడటంతో ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. రాష్ట్రంలో వరుసగా వాహనాలు లోయల్లో పడి ప్రాణనష్టం జరుగుతుండటంతో అధికారులు రోడ్ల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.