షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 18 నవం 2026, 8:43 ఉద.
క్రైమ్

లయన్స్‌ కంటి ఆసుపత్రి స్థలదాత కాపా గోపాలరావు మృతి

Truth into the light
ప్రచురణ తేదీ: 18 నవం 2026, 8:43 ఉద. రచన: One News Desk
16 వీక్షణలు 0 వ్యాఖ్యలు
లయన్స్‌ కంటి ఆసుపత్రి స్థలదాత కాపా గోపాలరావు మృతి

ఘనంగా నివాళులర్పించిన లయన్స్‌ క్లబ్‌ గవర్నర్లు, ప్రజాప్రతినిధులు

వైరా, ఆంధ్రప్రభ : లయన్స్‌ కంటి ఆసుపత్రికి స్థలం అందించిన కాపా గోపాలరావు (85) మంగళవారం రాత్రి మృతి చెందారు. ఫాస్ట్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌, లయన్‌ డాక్టర్‌ కాపా మురళీకృష్ణ తండ్రి అయిన గోపాలరావు మృతి విషయం తెలుసుకున్న లయన్స్‌ క్లబ్‌ గవర్నర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా 320 ఈ గవర్నర్‌ కె.వి. ప్రసాద్‌, ఫాస్ట్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్లు గోలి అమరేందర్‌రెడ్డి, యారాల మోహన్‌రెడ్డి, సిహెచ్‌.వి. శివప్రసాద్‌, మోతుకూరి మురళీధర్‌రావు, అమృతవల్లి కోటేశ్వరరావు, కె.ఎన్. ప్రసాద్‌ తదితరులు నివాళులర్పించారు.

లయన్స్‌ నాయకులు జేబీ మోహన్‌, జంగా సత్యనారాయణ, మందపాటి ప్రభాకర్‌రెడ్డి, గండ్ర సోమిరెడ్డి, మందపాటి చెన్నారెడ్డి, మురిసెట్టి మోహన్‌రావు, ఆరుద్ర సత్యనారాయణ, లిటిల్‌ ఫ్లవర్‌ విద్యాసంస్థల అధినేత పోతినేని భూమేష్‌, ఠాగూర్‌ విద్యాసంస్థల అధినేత సంక్రాంతి రవికుమార్‌, పారుపల్లి కృష్ణారావు, మేడ ప్రసాద్‌, దాసరి శ్రీనివాసరావు, బెల్లంకొండ ఆంజనేయులు, దారా శ్రీనివాసరావు, కర్నాటి లక్ష్మారెడ్డి, టీవీ9 రాజారావు, రవితేజ, మహేష్‌, శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కాపా చంద్రకళ, కాపా రామారావు, కాపా అప్పయ్య, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కాపా సుధాకర్‌ తదితర ప్రజాప్రతినిధులు, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు.

#క్రైమ్
ఘనంగా నివాళులర్పించిన లయన్స్‌ క్లబ్‌ గవర్నర్లు, ప్రజాప్రతినిధులు వైరా, ఆంధ్రప్రభ : లయన్స్‌ కంటి ఆసుపత్రికి స్థలం అందించిన కాపా గోపాలరావు (85) మంగళవారం రాత్రి మృతి చెందారు. ఫాస్ట్‌…