షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 18 నవం 2026, 6:38 సా.
తాజా వార్తలు

పౌరసత్వానికి ముందే ఓటు హక్కా?.. సోనియా ఓటు నమోదు వివాదంపై కోర్టు ఆదేశాలు

Truth into the light
ప్రచురణ తేదీ: 18 నవం 2026, 6:38 సా. రచన: One News Desk
10 వీక్షణలు 0 వ్యాఖ్యలు
పౌరసత్వానికి ముందే ఓటు హక్కా?.. సోనియా ఓటు నమోదు వివాదంపై కోర్టు ఆదేశాలు

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఓటరు జాబితాలో ఆమె పేరు చేర్చారంటూ దాఖలైన ఫిర్యాదుపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. 1983 ఏప్రిల్‌లో ఆమె భారత పౌరసత్వం తీసుకోగా, అంతకుముందే 1980లోనే నకిలీ పత్రాలతో ఓటరుగా నమోదు చేసుకున్నారని న్యాయవాది వికాస్ త్రిపాఠి 2025 ఆగస్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యల నివేదిక సమర్పించాలని ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్ అధికారిని జడ్జి వినోద్ జోషి ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేశారు. 1980, 1981, 1983 సంవత్సరాల ఓటరు జాబితాల నకళ్లను ఫిర్యాదుదారు కోర్టుకు సమర్పించగా, అసలు ధృవీకరించిన పత్రాలను దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది. గతంలో మేజిస్ట్రేట్ ఈ ఫిర్యాదును కొట్టివేయగా, సెషన్స్ కోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేసి మళ్లీ విచారణ జరపాలని ఆదేశించింది. 1980లో ఓటరు జాబితాలో చేరిన ఆమె పేరు, 1982లో తొలగించబడి, తిరిగి 1983లో చేర్చబడిందని పిటిషనర్ ఆరోపించారు. భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని, ఆమె పౌరసత్వం లేని సమయంలో ఓటరుగా ఎలా నమోదయ్యారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని కోర్టు పేర్కొంది.

#తాజావార్తలు
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఓటరు జాబితాలో ఆమె పేరు చేర్చారంటూ దాఖలైన ఫిర్యాదుపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు…