షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 19 నవం 2026, 1:52 సా.
క్రైమ్ వార్తలు

13 మందికి జైలు శిక్ష.. 2012 ఐయూఎంఎల్ కార్యకర్త హత్య కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు

Truth into the light
ప్రచురణ తేదీ: 19 నవం 2026, 1:52 సా. రచన: One News Desk
9 వీక్షణలు 0 వ్యాఖ్యలు
13 మందికి జైలు శిక్ష.. 2012 ఐయూఎంఎల్ కార్యకర్త హత్య కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు

దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని కన్నూర్‌లో 14 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) కార్యకర్త అబ్దుల్ షుక్కూర్ దారుణ హత్య కేసులో కొచ్చిలోని ప్రత్యేక సీబీఐ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 13 మంది నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు విధించగా, సీనియర్ సీపీఐ(ఎం) నాయకులు పి. జయరాజన్, టీవీ రాజేష్ సహా 18 మందిని నిర్దోషులుగా తేల్చింది. సుదీర్ఘ న్యాయపోరాటం, దర్యాప్తు సంస్థ మార్పు, సీనియర్ సీపీఐ(ఎం) నేతల ప్రమేయంతో కూడిన రాజకీయ కుట్ర ఆరోపణల నడుమ, కేరళలో అత్యంత రాజకీయ సున్నితత్వం కలిగిన హత్య కేసుల్లో ఒకటైన ఈ కేసులో ఒక కీలక దశ ఈ తీర్పుతో ముగిసింది. 2012 ఫిబ్రవరి 20న కన్నూర్ జిల్లాలోని కన్నపురం సమీపంలోని కీళారా వద్ద షుక్కూర్ హత్య జరిగింది. అదే రోజు అంతకు ముందు సీపీఐ(ఎం) నాయకులు పి. జయరాజన్, టీవీ రాజేష్ ప్రయాణిస్తున్న వాహనంపై జరిగిన దాడికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే దోషులుగా తేలిన వారిలో పలువురికి సీపీఐ(ఎం), దాని యువజన విభాగమైన డీవైఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయి.

ఏడుగురికి జీవిత ఖైదు..

ఈ కేసులో మొదటి నిందితుడితో సహా హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తేలిన ఏడుగురు దోషులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. మిగిలిన ఆరుగురు దోషులకు విధించిన శిక్ష మూడేళ్ల కంటే తక్కువగా ఉండటంతో వారికి బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుపై కేరళ మంత్రి, సీనియర్ ఐయూఎంఎల్ నాయకుడు పీకే కున్హాలికుట్టి స్పందిస్తూ.. ఈ తీర్పును తమ పార్టీ సవాల్ చేస్తుందని తెలిపారు. షుక్కూర్ హత్య ఒక క్రూరమైన, ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని పేర్కొన్నారు. తమ న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

#క్రైమ్వార్తలు
దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని కన్నూర్‌లో 14 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) కార్యకర్త అబ్దుల్ షుక్కూర్ దారుణ హత్య కేసులో…