షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 19 నవం 2026, 9:32 ఉద.
తాజా వార్తలు

22 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు.. CAIT నివేదిక

Truth into the light
ప్రచురణ తేదీ: 19 నవం 2026, 9:32 ఉద. రచన: One News Desk
12 వీక్షణలు 0 వ్యాఖ్యలు
22 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు.. CAIT నివేదిక

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో రాబోయే పెళ్లిళ్ల సీజన్ వ్యాపార రంగానికి కాసుల వర్షం కురిపించనుంది. 2026 నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 మధ్య దేశవ్యాప్తంగా సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్నాయని, తద్వారా ఏకంగా రూ.7.5 లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం ఉందని అఖిల భారత వర్తకుల సమాఖ్య (CAIT) అంచనా వేసింది. ఈ సీజన్ దేశీయ వినియోగానికి భారీ ఊతమివ్వడమే కాకుండా, సుమారు 1.25 కోట్ల మందికి తాత్కాలిక, సీజనల్ ఉపాధి అవకాశాలను కల్పించనుందని తెలిపింది. దేశంలోని 25 రాష్ట్రాల్లో 300 మందికి పైగా వ్యాపార నాయకులు, 550 వాణిజ్య సంఘాలతో సంప్రదించిన అనంతరం 'కైట్ రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ' ఈ నివేదికను రూపొందించింది.

నివేదిక ప్రకారం.. మొత్తం రూ. 7.5 లక్షల కోట్ల వ్యాపారంలో వస్తువులు, రిటైల్ కొనుగోళ్ల వాటా రూ.4.05 లక్షల కోట్లు (54 శాతం) కాగా, సేవల రంగం వాటా రూ.3.45 లక్షల కోట్లు (46 శాతం)గా ఉండనుంది. వస్తువుల కొనుగోళ్లలో ఆభరణాలు, విలువైన లోహాలే అగ్రస్థానంలో నిలవనున్నాయి. వీటిపై రూ. 1.2 లక్షల కోట్లు ఖర్చు చేయనుండగా, ఆ తర్వాత వస్త్రాలు, చీరలు, గార్మెంట్స్ విభాగంలో రూ. 90,000 కోట్ల వ్యాపారం జరగనుంది. ఇక సేవల విభాగంలో క్యాటరింగ్, ఆహార సేవల ద్వారా రూ. 75,000 కోట్లు, పెళ్లి వేదికలు, బాంకెట్ హాళ్లు, హోటళ్ల ద్వారా రూ. 60,000 కోట్ల ఆదాయం సమకూరనుంది. ఒక్క ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోనే సుమారు 5 లక్షల వివాహాలు జరగనుండగా, దీని ద్వారా రూ. 2.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని కైట్ వెల్లడించింది.

ఈ పెళ్లిళ్ల సీజన్ వల్ల రిటైల్, తయారీ, ఆతిథ్యం (హాస్పిటాలిటీ), రవాణా, ఫుడ్ ప్రాసెసింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగాలకు భారీ మద్దతు లభిస్తుందని సమాఖ్య పేర్కొంది. డెకరేటర్లు, క్యాటరర్లు, ఫోటోగ్రాఫర్లు, రవాణాదారులు, ఇతర సేవా ప్రదాతలకు సుమారు 1.25 కోట్ల తాత్కాలిక, పార్ట్-టైమ్ ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. పెళ్లిళ్ల సీజన్ కేవలం సామాజిక, సాంస్కృతిక వేడుక మాత్రమే కాదని, లక్షలాది మంది వినియోగదారులు, వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు (MSMEs), హస్తకళాకారులను ఏకం చేసే ఒక శక్తివంతమైన ఆర్థిక పరిణామమని కైట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అభివర్ణించారు.

#తాజావార్తలు
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో రాబోయే పెళ్లిళ్ల సీజన్ వ్యాపార రంగానికి కాసుల వర్షం కురిపించనుంది. 2026 నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 మధ్య దేశవ్యాప్తంగా సుమారు…