షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 19 నవం 2026, 5:30 సా.
తాజా వార్తలు

భోపాల్‌లో యువకుడి హంగామా.. కారుపై నిలుచుని బీర్ బాటిల్‌తో వీడియో వైరల్

Truth into the light
ప్రచురణ తేదీ: 19 నవం 2026, 5:30 సా. రచన: One News Desk
9 వీక్షణలు 0 వ్యాఖ్యలు
భోపాల్‌లో యువకుడి హంగామా..  కారుపై నిలుచుని బీర్ బాటిల్‌తో వీడియో వైరల్

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా మాయలో పడి యువత ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడంలేదు. కొన్నిసార్లు వాళ్లు చేసే సాహసాలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు అలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటే మరికొందరు కేసుల పాలు అవుతున్నారు. తాజాగా ఓ యువకుడు చేసిన పని కూడా అలానే ఉంది. సోషల్ మీడియా పిచ్చితో భోపాల్‌కు చెందిన ఓ యువకుడు కారుపై బీర్ బాటిల్ పట్టుకుని హల్ చల్ చేశాడు. ఆ యువకుడు కారు టాప్ పై నిలుచుని బీర్ తాగుతూ ఉండగా, అతడి స్నేహితులు వీడియో తీశారు. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై తాగటమే కాకుండా కారు టాప్ ఎక్కి తాగుతూ విన్యాసాలు చేయడంపై మండిపడుతున్నారు. అతడిని గుర్తించి చర్యలు తీసుకోవాలని వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి వాళ్ల వల్ల ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

#తాజావార్తలు
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా మాయలో పడి యువత ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడంలేదు. కొన్నిసార్లు వాళ్లు చేసే సాహసాలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు అలా ప్రాణాల మీదకు…