షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 19 నవం 2026, 6:01 ఉద.
తాజా వార్తలు

నక్సలిజం అంతం.. బస్తర్‍లో 100కు పైగా నేతలకు వీఐపీ భద్రత తొలగింపు

Truth into the light
ప్రచురణ తేదీ: 19 నవం 2026, 6:01 ఉద. రచన: One News Desk
10 వీక్షణలు 0 వ్యాఖ్యలు
నక్సలిజం అంతం..  బస్తర్‍లో  100కు పైగా నేతలకు వీఐపీ భద్రత తొలగింపు

దిశ, డైనమిక్ బ్యూరో: ఆపరేషన్ కగార్‍తో పాటు ప్రభుత్వం తీసుకున్న లొంగుబాటు చర్యల వల్ల రాష్ట్రంలో నక్సలిజం అంతం అయినట్లు అధికారికంగా ప్రకటించిన ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం వీఐపీ భద్రతా విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా రాజకీయ నేతల భద్రతలో కోత విధించారు. బస్తర్ డివిజన్‌కు చెందిన 47 మంది వీఐపీ నేతల భద్రతను పూర్తిగా తొలగించారు. మరోవైపు, 50 మందికి పైగా నేతల భద్రతా కేటగిరీని తగ్గించారు. హోం శాఖకు చెందిన ప్రొటెక్షన్ రివ్యూ కమిటీ (Protection Review Committee) నిర్ణయం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నేతల భద్రతలో కోత విధించారు. ఈ నిర్ణయం కింద ముఖ్యమంత్రి సతీమణి కౌశల్య సాయ్, మంత్రులు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకుల భద్రతా ఏర్పాట్లలో మార్పులు చేశారు.

దశలవారీగా నేతల భద్రత కుదింపు:

రాష్ట్రంలో నక్సల్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడం, ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆయా నేతలకు కల్పిస్తున్న భద్రతను పరిశీలించిన అనంతరం ప్రొటెక్షన్ రివ్యూ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నాయకుల భద్రత తగ్గింపుపై ఇటీవల స్పందించిన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ.. నక్సల్ కేడర్ మొత్తాన్ని గుర్తించి, నిర్మూలించడంతో నక్సలిజం అంతమైందని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇంకా ఆరు నెలల పరివర్తన కాలం ఉందన్నారు. ఆ తర్వాత ప్రతి రాజకీయ నాయకుడికి భద్రతను పూర్తిగా దశలవారీగా తొలగిస్తామని స్పష్టం చేశారు.

మణిపూర్‌‍కు సీఆర్పీఎఫ్ బెటాలియన్‌: 

నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్ నుండి ఒక సీఆర్పీఎఫ్ బెటాలియన్‌ను ఇటీవల మణిపూర్‌కు తరలించారు. దీనిపై స్పందించిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ బస్తర్ ప్రాంతంలో కేంద్ర పోలీసు బలగాల అవసరం ఇకపై లేదని, అవి క్రమంగా ఆ ప్రాంతం నుండి తరలిపోతున్నాయని సోమవారం తెలిపారు. కేంద్ర బలగాలు బస్తర్‌కు తిరిగి రావడం లేదని, బదులుగా ఈశాన్య, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ అంతటా ఎన్నికలు, శాంతిభద్రతల విధులను నిర్వహించడానికి వారిని తిరిగి నియమిస్తున్నారని శర్మ పేర్కొన్నారు. నాయకులకు భద్రతా కుదిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చ జోరందుకుంది. ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్ డివిజన్‌లో పెద్ద సంఖ్యలో వీఐపీ నేతల భద్రతను ఉపసంహరించుకోవడం కీలక పరిణామంగా భావిస్తున్నారు.

#తాజావార్తలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఆపరేషన్ కగార్‍తో పాటు ప్రభుత్వం తీసుకున్న లొంగుబాటు చర్యల వల్ల రాష్ట్రంలో నక్సలిజం అంతం అయినట్లు అధికారికంగా ప్రకటించిన ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం వీఐపీ భద్రతా…