షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 21 నవం 2026, 8:55 ఉద.
క్రైమ్

Bangalore | భార్యను 3 రోజులు గదిలో బంధించిన భర్త…

Truth into the light
ప్రచురణ తేదీ: 21 నవం 2026, 8:55 ఉద. రచన: One News Desk
8 వీక్షణలు 0 వ్యాఖ్యలు

Bangalore | భార్యను 3 రోజులు గదిలో బంధించిన భర్త…

భార్యను గదిలో బంధించి మూడు రోజుల పాటు చిత్రహింసలు
పోలీసుల రాకతో వెలుగులోకి దారుణం.. నిందితుడు పరారీ

Bangalore | బెంగళూరు, ఆంధ్రప్రభ : కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కన్న కొడుకును సుత్తితో కొట్టి హత్య చేయడమే కాకుండా, భార్యపై దాడి చేసి గదిలో బంధించాడు. మూడు రోజుల పాటు ఆమెను బయటకు రానివ్వకుండా నిర్బంధించాడు. ఈ ఘటన బెంగళూరులోని పద్మనాభనగర్‌లో వెలుగుచూసింది.

కొడుకును సుత్తితో కొట్టి హత్య…

వివరాల్లోకి వెళ్తే.. సుదీప్ అనే వ్యక్తి ఈనెల 16న తన కుమారుడు సోహమ్ దాస్‌పై సుత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం భార్య సీమా దాస్‌పై కూడా తీవ్రంగా దాడి చేసి గాయపరిచాడు. ఆ తర్వాత ఆమెను ఓ గదిలో బంధించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మూడు రోజుల పాటు గదిలోనే…

తీవ్ర గాయాలతో ఉన్న సీమా దాస్ మూడు రోజుల పాటు గదిలోనే బందీగా ఉండిపోయింది. ఈ క్రమంలో ఈనెల 19న అపార్ట్‌మెంట్ యజమాని మల్లయ్యకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి గదిలో ఉన్న సీమాను రక్షించారు.

నిందితుడి కోసం పోలీసుల గాలింపు…

ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుమారుడిని హత్య చేసి, భార్యను తీవ్రంగా గాయపరిచిన సుదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

#క్రైమ్
Bangalore | భార్యను 3 రోజులు గదిలో బంధించిన భర్త… భార్యను గదిలో బంధించి మూడు రోజుల పాటు చిత్రహింసలుపోలీసుల రాకతో వెలుగులోకి దారుణం.. నిందితుడు పరారీ Bangalore |…