షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 21 నవం 2026, 1:19 సా.
యోగా

నీట్ పేపర్ లీకేజీ కేసు..14 మంది నిందితుల పై అభియోగాలు నమోదు చేసిన ఢిల్లీ కోర్టు

Truth into the light
ప్రచురణ తేదీ: 21 నవం 2026, 1:19 సా. రచన: One News Desk
10 వీక్షణలు 0 వ్యాఖ్యలు
నీట్ పేపర్ లీకేజీ కేసు..14 మంది నిందితుల పై అభియోగాలు నమోదు చేసిన ఢిల్లీ కోర్టు

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో విచారణ ప్రక్రియ కు మార్గం సుగమం అయింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టు శనివారం (నవంబర్ 21) 14 మంది నిందితులపై అధికారికంగా అభియోగాలను (Charges) నమోదు చేసింది. నిందితులందరూ తాము నిర్దోషులమని (Not-guilty) పేర్కొన్న నేపథ్యంలో, ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ గుప్తా (Special Judge Ajay Gupta) వారిపై అభియోగాలను నమోదు చేశారు. మోసం (Cheating), నేరపూరిత విశ్వాస ఘాతుకం (Criminal breach of trust), అవినీతి (Corruption), పరీక్షలకు సంబంధించిన అక్రమాలకు పాల్పడినట్లు నిందితులపై ప్రాథమిక ఆధారాలు (Prima facie case) ఉన్నాయని కోర్టు గతంలోనే స్పష్టం చేసింది. నిందితులపై అభియోగాల నమోదు ప్రక్రియ పూర్తి కావడంతో, ఈ కేసులో ఇకపై తుది విచారణ (Trial) ప్రారంభం కానుంది.

#యోగా
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో విచారణ ప్రక్రియ కు మార్గం సుగమం అయింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టు శనివారం…