షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 22 నవం 2026, 10:15 ఉద.
భక్తి

యూపీలో దారుణం.. క్షుద్రపూజల కోసం పక్కింటి చిన్నారిని బలితీసుకున్న మహిళ

Truth into the light
ప్రచురణ తేదీ: 22 నవం 2026, 10:15 ఉద. రచన: One News Desk
8 వీక్షణలు 0 వ్యాఖ్యలు
యూపీలో దారుణం.. క్షుద్రపూజల కోసం పక్కింటి చిన్నారిని బలితీసుకున్న మహిళ

దిశ, వెబ్ డెస్క్: యూపీలో దారుణం చోటు చేసుకుంది. శనివారం బులంద్‌షహర్‌లోని భూద్‌లో ఓ మహిళ ఇంటిలో మూడేళ్ల బాలిక మృతదేహం కనిపించడం కలకలం రేపింది. చనిపోయిన బాలిక తల్లిదండ్రులతో కలిసి ఆ ఇంటికి 40 మీటర్ల దూరంలోనే ఉంటుండగా శనివారం ఉదయం కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించగా అక్కడే 40 మీటర్ల దూరంలో రోహ్‌తాష్ రాజ్ పుత్‌ అనే వ్యక్తి ఇంటికి కుక్క వెళ్లింది. దీంతో ఆ ఇంట్లో తనిఖీ చేయగా బాలిక మృతదేహం లభించింది.

అయితే ఆ ఇంట్లో సోనాలి అనే మహిళ కొంతకాలంగా నివాసం ఉండడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని ఊపిరి ఆడకుండా చేసి హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. క్షుద్రపూజలు చేసేందుకే మహిళ చిన్నారిని బలిచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పరీక్ష కోసం పంపినట్టు తెలిపారు. హత్యకు గల కారణాలు, పరిస్థితులు నిర్దారించడానికి అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. పోస్ట్ మార్టం నివేదికల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

#భక్తి #మహిళ
దిశ, వెబ్ డెస్క్: యూపీలో దారుణం చోటు చేసుకుంది. శనివారం బులంద్‌షహర్‌లోని భూద్‌లో ఓ మహిళ ఇంటిలో మూడేళ్ల బాలిక మృతదేహం కనిపించడం కలకలం రేపింది. చనిపోయిన బాలిక తల్లిదండ్రులతో…