షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 23 నవం 2026, 5:54 సా.
సైబర్ సెక్యూరిటీ

బంపర్ డిస్కౌంట్లు ఉన్నాయని క్లిక్ చేస్తే కొంపకొల్లేరే.. సైబర్ సెక్యూరిటీ పోలీసుల హైఅలర్ట్..

Truth into the light
ప్రచురణ తేదీ: 23 నవం 2026, 5:54 సా. రచన: One News Desk
19 వీక్షణలు 0 వ్యాఖ్యలు
బంపర్ డిస్కౌంట్లు ఉన్నాయని క్లిక్ చేస్తే కొంపకొల్లేరే.. సైబర్ సెక్యూరిటీ పోలీసుల హైఅలర్ట్..

బ్లాక్ ఫ్రైడే ఆన్‌లైన్ షాపింగ్ సేల్స్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలను అప్రమత్తం చేసింది. భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ ప్రకటనలు, ఫిషింగ్ లింకుల ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నారని హెచ్చరించింది. ప్రముఖ ఉత్పత్తులపై నమ్మశక్యం కాని ధరలకు ఆఫర్లు ప్రకటిస్తూ సైబర్ నేరగాళ్లు నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా వేదికల ద్వారా అనుమానాస్పద లింకులను పంపించి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఈ లింకులపై క్లిక్ చేసి కొనుగోళ్లు జరిపే సమయంలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను దొంగిలించే ప్రమాదం ఉందని TGCSB వెల్లడించింది. అంతేకాకుండా నకిలీ పేమెంట్ లింకులు, క్యూఆర్ కోడ్లను పంపించి బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి అనధికారికంగా డబ్బులు బదిలీ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హెచ్చరించింది.

అధికారుల కీలక సూచనలు

  • పేరున్న వెబ్‌సైట్లు, అధికారిక షాపింగ్ యాప్‌ల ద్వారానే వస్తువులను కొనుగోలు చేయాలి.
  • ఏదైనా లింక్‌పై క్లిక్ చేసే ముందు వెబ్‌సైట్ చిరునామాను జాగ్రత్తగా పరిశీలించాలి.
  • అతిగా కనిపించే డిస్కౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
  • ఓటీపీ, యూపీఐ పిన్, సీవీవీ వంటి వివరాలను ఎవరికీ చెప్పకూడదు.
  • అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండాలి
  • అనుమానాస్పద క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయకూడదు.
  • సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి

ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, అత్యవసర ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని TGCSB స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా సైబర్ ఆర్థిక మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని సూచించింది. అలాగే అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విజ్ఞప్తి చేసింది.

#సైబర్సెక్యూరిటీ #టెక్నాలజీ
బ్లాక్ ఫ్రైడే ఆన్‌లైన్ షాపింగ్ సేల్స్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలను అప్రమత్తం చేసింది. భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన…