షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 23 నవం 2026, 10:20 సా.
అంతర్జాతీయం

Russia Ukraine War : రష్యాకు ఉక్రెయిన్ భారీ షాక్.. లిబియా తీరంలో యుద్ధనౌకను పేల్చేశాం.. జెలెన్‌స్కీ వీడియో!

Truth into the light
ప్రచురణ తేదీ: 23 నవం 2026, 10:20 సా. రచన: One News Desk
9 వీక్షణలు 0 వ్యాఖ్యలు
Russia Ukraine War : రష్యాకు ఉక్రెయిన్ భారీ షాక్.. లిబియా తీరంలో యుద్ధనౌకను పేల్చేశాం.. జెలెన్‌స్కీ వీడియో!
  • సముద్రంలో రష్యా నౌకలకు ముప్పు..
  • ఏడు డ్రోన్లతో జెలెన్‌స్కీ మెరుపు దాడి
  • లిబియా తీరంలో రష్యా యుద్ధనౌక ఖతం..

Russia Ukraine War : యుద్ధం అంటే కేవలం భూమి మీదే కాదు.. సముద్రంలోనూ సాగుతుందని మరోసారి నిరూపించింది ఉక్రెయిన్.. రష్యాకు చెందిన యుద్ధనౌకను లిబియా తీరంలో ముంచేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. ఈ దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడంతో ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది..

కేఏ-27 యుద్ధ హెలికాప్టర్ ధ్వంసం :
జెలెన్‌స్కీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్ తయారు చేసిన 7 నేవీ డ్రోన్లతో రష్యాకు చెందిన 2 నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఒకటి చిన్నపాటి యుద్ధనౌక ‘మెర్క్యురీ’. 2023లో అందుబాటులోకి వచ్చిన ఈ నౌక రష్యా నౌకాదళానికి చెందిన ఆధునిక యుద్ధనౌకల్లో ఒకటిగా చెబుతున్నారు. ఈ దాడిలో కేఏ-27 యుద్ధ హెలికాప్టర్ కూడా ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.

ఇక మరోవైపు రష్యాకు చెందిన ‘ఎమ్‌వీ అంగారా’ సరకు రవాణా నౌకను కూడా ఉక్రెయిన్ డ్రోన్లు టార్గెట్ చేసినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఆయుధాల రవాణాకు ఈ నౌకను ఉపయోగిస్తున్నట్లు ఆయన ఆరోపించారు.

An exemplary Ukrainian operation in response to Russia’s war. I thank the warriors of the Security Service of Ukraine and all our Defense Forces of Ukraine who took part in carrying out these tasks. I received detailed briefings on the operation’s steps yesterday and today – the targets we set were achieved.

It all took place off the coast of Libya. Our warriors deployed seven Ukrainian-made naval drones. Despite all the enemy’s efforts to counter the attack, the Russian corvette Merkury was sunk. It’s one of their newest ships, commissioned in 2023, during the full-scale war. A Ka-27 combat helicopter was also destroyed along with the corvette. Our second target was the Russian dry cargo vessel MV ANGARA, which the enemy used to transport weapons. Result: target hit.

We continue our operations in designated waters. We are responding to Russia’s aggression. We are developing Ukrainian weapons. Glory to Ukraine!

— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) November 23, 2026

బెంగాజీ నౌకాశ్రయం సమీపంలో దాడి :
అసలు ఈ దాడి లిబియాలోని బెంగాజీ నౌకాశ్రయం సమీపంలో జరిగింది.. ఇంధనం, ఇతర అవసరాల కోసం మెర్క్యురీ యుద్ధనౌక అక్కడ ఉన్న సమయంలో ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

జెలెన్‌స్కీ అభినందనలు :
జెలెన్‌స్కీ విడుదల చేసిన వీడియోలో సముద్రంపై దూసుకొచ్చిన డ్రోన్లు నౌకలను ఢీకొట్టడం, ఆ వెంటనే భారీ పేలుళ్లు సంభవించడం, మంటలు ఎగసిపడటం కనిపిస్తున్నాయి. శత్రువులు నష్టాన్ని తగ్గించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న తమ భద్రతా సంస్థల సిబ్బందిని జెలెన్‌స్కీ ప్రత్యేకంగా అభినందించారు.

#అంతర్జాతీయం
సముద్రంలో రష్యా నౌకలకు ముప్పు.. ఏడు డ్రోన్లతో జెలెన్‌స్కీ మెరుపు దాడి లిబియా తీరంలో రష్యా యుద్ధనౌక ఖతం.. Russia Ukraine War : యుద్ధం అంటే కేవలం భూమి…