యువతిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురి అరెస్టు
కేఫ్‌లో పార్టీ తర్వాత దారుణం.. యువతిపై ఇద్దరి అఘాయిత్యం
సహోద్యోగినిపై సామూహిక అత్యాచారం.. ఆరుగురిపై కేసు.. మరో ముగ్గురు పరారీ
అర్ధరాత్రి పార్టీ.. తెల్లవారుజామున యువతిపై అత్యాచారం
ఢిల్లీ కేఫ్‌లో పార్టీ వేళ దారుణం..
పార్టీకి వెళ్లిన యువతిపై అత్యాచారం.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలన
ప్రీత్ విహార్ కేఫ్‌లో ఏం జరిగింది? యువతి ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేఫ్‌లో అర్ధరాత్రి జరిగిన పార్టీ అనంతరం 22 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు, నిందితులు కర్కర్‌డూమాలోని క్రాస్ రివర్ మాల్‌లో ఉన్న కేఫ్-8లో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి బాధితురాలితోపాటు మొత్తం ఎనిమిది మంది ప్రీత్ విహార్‌లోని సల్తనేట్ కేఫ్‌లో పార్టీకి సమావేశమయ్యారు. సాధారణంగా రాత్రి 11.30 గంటలకు మూసివేసే ఈ కేఫ్‌ను.. సిబ్బందిలో ఒకరి వద్ద తాళాలు ఉండటంతో అర్ధరాత్రి మళ్లీ తెరిచి పార్టీ కొనసాగించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో బృందంలోని సభ్యులు మద్యం సేవించినట్లు సమాచారం. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కేఫ్ నుంచి బయటకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఇతర సహోద్యోగులు వారికి సహకరించారని బాధితురాలు ఆరోపించింది.
ఈ ఘటనపై నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు సహా ఆరుగురిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు మహిళలతోపాటు ముగ్గురిని అరెస్టు చేయగా, మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలాన్ని ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో నమోదు చేస్తున్నారు. అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట కూడా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఘటన జరిగిన వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించలేదు. ఆమె ఓ పురుష స్నేహితుడు, మరో ఇద్దరు మహిళలతో కలిసి వాహనంలో వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.