షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 25 నవం 2026, 10:30 సా.
క్రైమ్ వార్తలు

నక్సల్ నెట్‌వర్క్‌పై భద్రతా బలగాల ముప్పేట దాడి.. నారాయణపూర్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం

Truth into the light
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 10:30 సా. రచన: One News Desk
7 వీక్షణలు 0 వ్యాఖ్యలు
నక్సల్ నెట్‌వర్క్‌పై భద్రతా బలగాల ముప్పేట దాడి.. నారాయణపూర్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం

దిశ, వెబ్‌డెస్క్: నక్సల్ నెట్‌వర్క్‌పై భద్రతా బలగాలు ముప్పేట దాడి కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా నారాయణపూర్ మరియు బీజాపూర్ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో పోలీసులకు, భద్రతా బలగాలకు భారీ విజయాలు లభించాయి.

నారాయణపూర్‌లో ఆయుధాల జప్తు..

నారాయణపూర్ జిల్లాలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా పోలీసు, బీఎస్ఎఫ్ బలగాలకు పెద్ద విజయం చేకూరింది. ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని చాల్చేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచి ఉంచిన భారీ ఆయుధాల డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. లొంగిపోయిన మావోయిస్టు క్యాడర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ సంయుక్త సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో SLR, INSAS రైఫిల్స్‌తో పాటు ఒక దేశీ కట్టాను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 104 తూటాలు, 5 మ్యాగజీన్లు, 2 వాకీటాకీలు, ఇతర నక్సల్ సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సందీప్ కుమార్ పటేల్ మార్గదర్శకత్వంలో జరిగిన ఈ పోలీసు. బీఎస్ఎఫ్ సంయుక్త చర్య, నక్సల్ నెట్‌వర్క్‌పై దెబ్బకొట్టే దిశలో కీలక ముందడుగుగా నిలిచింది. అదేవిధంగా ఇదే క్రమంలో ఒడిశా రాష్ట్రంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఇద్దరు మావోయిస్టు క్యాడర్లు హింసా మార్గాన్ని వీడి బీజాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

#క్రైమ్వార్తలు
దిశ, వెబ్‌డెస్క్: నక్సల్ నెట్‌వర్క్‌పై భద్రతా బలగాలు ముప్పేట దాడి కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా నారాయణపూర్ మరియు బీజాపూర్ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో పోలీసులకు, భద్రతా బలగాలకు భారీ విజయాలు…