షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 25 నవం 2026, 8:15 సా.
మహిళ

మహిళ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా.. నిందితుడి అరెస్టు

Truth into the light
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 8:15 సా. రచన: One News Desk
18 వీక్షణలు 0 వ్యాఖ్యలు

ఫోన్‌లో మాట్లాడాలంటూ వేధింపులు
ఫొటోలు అప్‌లోడ్ చేసి పరువుకు భంగం
నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు

ఉట్నూరు, ఆంధ్రప్రభ : ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సీ (మాంగ్) కులానికి చెందిన మహిళను వేధిస్తూ, ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి ఫొటోలు అప్‌లోడ్ చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే తెలిపారు. బుధవారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ప్రఫుల్ దత్తాజీ బేజవార్ అలియాస్ బేజ్జరావర్ ప్రఫుల్ ప్రస్తుతం ఇచ్చోడలోని బర్కత్‌పుర కాలనీలో నివాసం ఉంటున్నాడు. గత కొంతకాలంగా బాధిత మహిళను వేధిస్తూ, ఫోన్‌లో మాట్లాడాలని బెదిరించడమే కాకుండా, ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి ఫొటోలను అప్‌లోడ్ చేశాడు. దీంతో తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలను వేధించడం, కులం ఆధారంగా అవమానించడం, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు పాల్పడటాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

#మహిళ
ఫోన్‌లో మాట్లాడాలంటూ వేధింపులుఫొటోలు అప్‌లోడ్ చేసి పరువుకు భంగంనిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు ఉట్నూరు, ఆంధ్రప్రభ : ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సీ (మాంగ్) కులానికి చెందిన మహిళను…