షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 26 నవం 2026, 11:54 సా.
రాజకీయాలు

Bihar: బిహార్‌ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లితో స్తంభించిన పాట్నా-బెగుసరాయ్ హైవే

Truth into the light
ప్రచురణ తేదీ: 26 నవం 2026, 11:54 సా. రచన: One News Desk
18 వీక్షణలు 0 వ్యాఖ్యలు
Bihar: బిహార్‌ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లితో స్తంభించిన పాట్నా-బెగుసరాయ్ హైవే

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని పేద రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌లో ఓ రాజకీయ నాయకుడి కుమార్తె వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లక్షలాది మంది అతిథులు, గుర్రపు పందాలు, భారీ విందులు, హెలీప్యాడ్ ఏర్పాట్లతో ఈ పెళ్లి వేడుక జనసంద్రం సృష్టించింది. బీహార్ కీలక నేత, మోకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన కుమార్తె శివాంగి సింగ్ వివాహానికి బహిరంగ ఆహ్వానం పలకడంతో బుధవారం పాట్నా జిల్లాలోని ఆయన స్వగ్రామం నాద్వాన్‌కు లక్షలాది మంది తరలివచ్చారు. బెగుసరాయ్-పాట్నా హైవేపై 10 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తొక్కిసలాటను తలపించే రద్దీ కారణంగా బీహార్ అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్ కాన్వాయ్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించిన గుర్రపు పందాలను చూసేందుకు లక్ష మందికి పైగా ప్రేక్షకులు తరలిరాగా, కొందరు విద్యుత్ టవర్లు ఎక్కి పోటీలను వీక్షించారు. జనసందోహం అదుపు తప్పడంతో ఫైనల్ రేసును వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ పోటీలో విజేతకు మహీంద్రా థార్ కారు, రెండో స్థానంలో మోటార్‌సైకిల్, స్కూటర్ బహుమతులుగా ప్రకటించారు. 4 లక్షల మంది అతిథుల కోసం 500 మంది వంటవాళ్లు, 300కి పైగా కిచెన్‌లను ఏర్పాటు చేశారు. 8 రకాల స్వీట్లు, బిహారీ ప్రత్యేక వంటకం లిట్టి-చోఖాతో భారీ విందుతో పాటు విదేశీ పూలతో జైపూర్ ప్యాలెస్ తరహాలో వేదికను ముస్తాబు చేశారు.

#రాజకీయాలు
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని పేద రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌లో ఓ రాజకీయ నాయకుడి కుమార్తె వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లక్షలాది మంది అతిథులు, గుర్రపు పందాలు,…