షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 26 నవం 2026, 7:41 సా.
బిజినెస్

Life Certificate Deadline : పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్ 30లోపు ఈ చిన్న పని చేయకపోతే పెన్షన్ కట్..!

Truth into the light
ప్రచురణ తేదీ: 26 నవం 2026, 7:41 సా. రచన: One News Desk
13 వీక్షణలు 0 వ్యాఖ్యలు
Life Certificate Deadline : పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్ 30లోపు ఈ చిన్న పని చేయకపోతే పెన్షన్ కట్..!
  • పెన్షన్ తీసుకునేవారికి ఇదే లాస్ట్ ఛాన్స్..
  • ఈ సర్టిఫికెట్ ఇవ్వకపోతే డబ్బులు రావు
  • పెన్షనర్లు ఈ విషయం అస్సలు మర్చిపోవద్దు

Life Certificate Deadline : ప్రతి నెలా వచ్చే పెన్షన్ డబ్బులపైనే ఆధారపడే వారికి బిగ్ అలర్ట్.. కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నవారు నవంబర్ 30వ తేదీలోపు తమ వార్షిక లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. ఈ గడువు మిస్ అయితే పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం తప్పదు.. అందుకే లాస్ట్ డేట్ వరకు ఆగకుండా ముందుగానే ఈ పని పూర్తి చేసుకోవడం ఎంతైనా మంచిది.. లేదంటే రావాల్సిన పెన్షన్ ఆగిపోతుంది జాగ్రత్త..

అసలు ఈ లైఫ్ సర్టిఫికెట్ ఎందుకు? :
పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి జీవించి ఉన్నారని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది జీవన్ ప్రమాణ్ డాక్యుమెంట్ అడుగుతుంది. దీనినే లైఫ్ సర్టిఫికెట్ అని పిలుస్తారు. 80 ఏళ్లలోపు పెన్షనర్లు నవంబర్ 1 నుంచి 30 వరకు ఈ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. 80 ఏళ్లు దాటిన వారికి అక్టోబర్ 1 నుంచే అవకాశం కల్పించారు. అయితే, వీరికి కూడా చివరి గడువు నవంబర్ 30నే అనేది గుర్తుంచకోండి..

ఇంట్లో నుంచే సమర్పించే అవకాశం :
లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు జీవన్ ప్రమాణ్ యాప్, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ సాయంతో ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. ఫేస్ ఐడెంటిటీ ద్వారా కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు.

స్మార్ట్‌ఫోన్ వాడటం తెలియని వారు దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్, బ్యాంకు లేదా పోస్టాఫీస్‌ను సంప్రదించవచ్చు. అంతేకాదు, పోస్టల్ శాఖకు చెందిన డోర్‌స్టెప్ సేవల ద్వారా ఇంటి వద్దకే పోస్టల్ సిబ్బందిని పిలిపించుకుని సర్టిఫికెట్ సమర్పించవచ్చు.

ఈ వివరాలు దగ్గర పెట్టుకోండి :
లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే సమయంలో ఆధార్ నంబర్, పెన్షన్ అకౌంట్ వివరాలు, పీపీఓ నంబర్, మొబైల్ నంబర్, బ్యాంక్ పాస్‌బుక్ వివరాలు రెడీగా ఉంచుకోవాలి. చిన్న పని కదా అని నిర్లక్ష్యం చేస్తే నెలవారీ పెన్షన్ విషయంలో ఇబ్బందులు తప్పవు.. నవంబర్ 30లోపే ఈ ప్రాసెస్ పూర్తి చేసి పెన్షన్ పొందండి..

#బిజినెస్
పెన్షన్ తీసుకునేవారికి ఇదే లాస్ట్ ఛాన్స్.. ఈ సర్టిఫికెట్ ఇవ్వకపోతే డబ్బులు రావు పెన్షనర్లు ఈ విషయం అస్సలు మర్చిపోవద్దు Life Certificate Deadline : ప్రతి నెలా వచ్చే…