షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 27 నవం 2026, 8:21 సా.
క్రైమ్ వార్తలు

MLA Arul Vignesh Arrest: మహిళా IAS అధికారికి అసభ్య మెసేజ్‌లు.. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్ అరెస్ట్

Truth into the light
ప్రచురణ తేదీ: 27 నవం 2026, 8:21 సా. రచన: One News Desk
12 వీక్షణలు 0 వ్యాఖ్యలు
MLA Arul Vignesh Arrest: మహిళా IAS అధికారికి అసభ్య మెసేజ్‌లు.. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్ అరెస్ట్

MLA Arul Vignesh Arrest: తమిళనాడులో టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలమే రేపింది. కళ్లకురిచి జిల్లా కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న మహిళా ఐఏఎస్ అధికారి జేఈ పద్మజకు ఆయన అసభ్యకరమైన సందేశాలు పంపారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు రావడంతో జిల్లాలో, రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

ఎస్పీకి ఫిర్యాదు.. కేసు నమోదు:

కళ్లకురిచి జిల్లా కలెక్టర్ జేఈ పద్మజ నవంబర్ 23వ తేదీన నేరుగా జిల్లా ఎస్పీని కలిసి ఈ అసభ్య సందేశాల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. మహిళా ఐఏఎస్ అధికారి నుంచి ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సందేశాలు ఎక్కడి నుంచి, ఎలా వచ్చాయి, ఇతర వివరాలు ఏమిటనే కోణంలో ప్రాథమికంగా సమాచారం సేకరించారు.

ఎమ్మెల్యే అరెస్ట్.. కొనసాగుతున్న దర్యాప్తు:

ఫిర్యాదుపై దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు తాజాగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్‌ను(MLA Arul Vignesh Arrest) అరెస్ట్ చేసి తదుపరి చర్యలు చేపట్టారు. మహిళా ఐఏఎస్ అధికారికి సందేశాలు పంపిన ఘటన వెనుక ఉన్న అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అరెస్ట్ ఘటన తమిళనాడు రాజకీయాల్లోనూ, పరిపాలనా వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా నిలిచింది.

#క్రైమ్వార్తలు #జాతీయం #రాజకీయాలు
MLA Arul Vignesh Arrest: తమిళనాడులో టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలమే రేపింది. కళ్లకురిచి జిల్లా కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న మహిళా…