నవంబర్ 29న ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష.. కరీంనగర్‌లో సెక్షన్ 163 అమలు
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష
20 పరీక్షా కేంద్రాల ఏర్పాటు.. ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేధాజ్ఞలు
కరీంనగర్, క్రైమ్, ఆంధ్రప్రభ : ఎస్సీటీ సబ్‌ఇన్‌స్పెక్టర్, తత్సమాన పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 29న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ), హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. ఇందుకోసం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేధాజ్ఞలు
శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కరీంనగర్ 1-టౌన్, 2-టౌన్, 3-టౌన్, ఎల్‌ఎండీ కాలనీ, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటాన్ని నిషేధించారు. ఈ ప్రాంతాల్లో చట్టబద్ధమైన సమావేశాలు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ ఉత్తర్వులు నవంబర్ 29న ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అమల్లో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
నిషేధాజ్ఞల నుంచి మినహాయింపు పొందినవారు