షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 27 నవం 2026, 8:19 సా.
క్రైమ్ వార్తలు

తమిళనాడు టీవీకే ఎమ్మెల్యే అరెస్ట్.. మహిళా అధికారిపై వేధింపుల ఆరోపణలు

Truth into the light
ప్రచురణ తేదీ: 27 నవం 2026, 8:19 సా. రచన: One News Desk
7 వీక్షణలు 0 వ్యాఖ్యలు
తమిళనాడు టీవీకే ఎమ్మెల్యే అరెస్ట్..  మహిళా అధికారిపై వేధింపుల ఆరోపణలు

దిశ, నేషనల్ బ్యూరో: మహిళా ఐఏఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో తమిళనాడుకు చెందిన టీవీకే పార్టీ ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవడానికి విజయ్ ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించిన మూడు రోజుల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది. తమకు అసభ్యకరమైన వాట్సాప్ మెసేజ్‌లు పంపడమే కాకుండా, మద్యం మత్తులో తన అధికారిక నివాసానికి వచ్చి వేధించారని సదరు మహిళా అధికారి ఫిర్యాదు చేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, ఆ అధికారి ఇంటి వద్ద భద్రత, సీసీ కెమెరాలు ఉండగా తాను లోపలికి ఎలా వెళ్లగలనని విఘ్నేష్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్పందిస్తూ, నిందితుడిని కాపాడేందుకు మంత్రులు ప్రయత్నించారని, 116 రోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. బాధిత అధికారిని రాజీకి ఒత్తిడి చేశారని, అయినా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారని ప్రశంసించారు. హైకోర్టు, జాతీయ మహిళా కమిషన్ జోక్యంతోనే ఈ అరెస్ట్ జరిగిందన్నారు. జులై 31నే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని, నవంబర్ 23న బాధిత అధికారి అధికారికంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. 

#క్రైమ్వార్తలు #రాజకీయాలు #మహిళ
దిశ, నేషనల్ బ్యూరో: మహిళా ఐఏఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో తమిళనాడుకు చెందిన టీవీకే పార్టీ ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.…