షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 27 నవం 2026, 7:29 సా.
క్రైమ్ వార్తలు

TVK MLA Arul Vignesh Arrest | మహిళా ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు..టీవీకే ఎమ్మెల్యే అరెస్ట్!

Truth into the light
ప్రచురణ తేదీ: 27 నవం 2026, 7:29 సా. రచన: One News Desk
11 వీక్షణలు 0 వ్యాఖ్యలు

తమిళనాడు, ఆంధ్రప్రభ : తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారిణిని లైంగికంగా వేధించారనే ఆరోపణలపై కల్లకురిచి టీవీకే ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన నివాసానికి చేరుకున్న మహిళా పోలీసులు.. అరెస్టు వారెంట్ చూపించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మహిళా అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కల్లకురిచి మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు నుంచి అరెస్టు వారెంట్ పొందిన అనంతరం ఇన్‌స్పెక్టర్ పి. భువనేశ్వరి నేతృత్వంలోని బృందం ఎమ్మెల్యే నివాసానికి వెళ్లింది. శుక్రవారం సాయంత్రం 6.15 గంటల సమయంలో వారెంట్ చూపించి ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు సమాచారం.

ఈ ఫిర్యాదుపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని నాలుగు నిబంధనలతో పాటు తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేశారు. మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఐజీ ఎన్. కామిని పర్యవేక్షణలో తిరుపూర్ ఎస్పీ సృష్టి సింగ్‌ను దర్యాప్తు అధికారిగా నియమించారు.మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారిణి కాకర్ల ఉష నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసింది.

అధికారిణి వాంగ్మూలం నమోదు

ఈ కేసులో బాధితురాలిగా పేర్కొన్న మహిళా ఐఏఎస్ అధికారిణి గురువారం జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి స్వాతి అలగప్పన్ ఎదుట హాజరయ్యారు. మూడు గంటలకు పైగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అంతకుముందు దర్యాప్తు బృందం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆమెను సుమారు రెండు గంటల పాటు విచారించింది.

కేసు విచారణలో భాగంగా జిల్లా సమాచార, ప్రజా సంబంధాల అధికారి సెంథిల్‌కుమార్, జిల్లా అటవీ అధికారి వి. ప్రియదర్శినిలను కూడా అధికారులు ప్రశ్నించారు. అలాగే కలెక్టర్ భర్త, విల్లుపురం జిల్లా కలెక్టర్ ఎస్. షేక్ అబ్దుల్ రెహమాన్‌ను త్యాగదుర్గంలోని ప్రభుత్వ అతిథి గృహంలో గంటసేపు విచారించారు.

#క్రైమ్వార్తలు #రాజకీయాలు #మహిళ
తమిళనాడు, ఆంధ్రప్రభ : తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారిణిని లైంగికంగా వేధించారనే ఆరోపణలపై కల్లకురిచి టీవీకే ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు…