షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 27 నవం 2026, 8:05 సా.
మహిళ

మహిళపై దారుణం.. జిమ్ కోచ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష!

Truth into the light
ప్రచురణ తేదీ: 27 నవం 2026, 8:05 సా. రచన: One News Desk
9 వీక్షణలు 0 వ్యాఖ్యలు

రాయదుర్గం, ఆంధ్రప్రభ: మహిళపై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన జిమ్ కోచ్‌కు న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.8 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన కేసులో తాజాగా న్యాయం జరిగింది.

మెహిదీపట్నంలోని జ్యోతినగర్‌కు చెందిన మొహమ్మద్ మౌజమ్ అలీ (39) జిమ్ కోచ్‌గా పనిచేసేవాడు. 2017 జనవరి నుంచి జిమ్‌లోని మహిళల బాత్రూమ్‌లో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. అంతేకాకుండా బాధితురాలి ఇంట్లోకి చొరబడి పలుమార్లు వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలితో పాటు ఆమె భర్తను పరువు తీస్తానంటూ బెదిరించాడని, మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి, ఫొటోలతో వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు 2017 ఫిబ్రవరి 11న తన భర్తకు విషయం తెలియజేసింది. అనంతరం ఫిబ్రవరి 13న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సాక్షులను విచారించడంతో పాటు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను సేకరించారు. 2017 ఫిబ్రవరి 15న నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు.

ఈ కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లోని 13వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఎం. వాణి నిందితుడిని దోషిగా నిర్ధారించారు. అతడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు రూ.8 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. మహిళపై లైంగిక దాడి, వేధింపుల కేసులో న్యాయస్థానం వెలువరించిన ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

#మహిళ
రాయదుర్గం, ఆంధ్రప్రభ: మహిళపై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన జిమ్ కోచ్‌కు న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు…