దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్టాండప్ కమెడియన్, కంటెంట్ క్రియేటర్ సమయ్ రైనా యూట్యూబ్ వేదికగా అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తన యూట్యూబ్ ఛానల్‌కు ఏకంగా 10 లక్షల మంది పెయిడ్ ఛానల్ మెంబర్స్‌ను సాధించిన మొట్టమొదటి యూట్యూబర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. సమయ్ రైనా సాధించిన ఈ అద్భుత ఘనతను యూట్యూబ్ సంస్థ అధికారికంగా ధృవీకరించింది. తొలినాళ్లలో చెస్ సంబంధిత కంటెంట్‌తో తన యూట్యూబ్ ప్రస్థానాన్ని ప్రారంభించిన సమయ్ రైనా, ఆ తర్వాత ఇండియాస్ గాట్ లాటెంట్ (India's Got Latent) షో ద్వారా దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. గతేడాది ‘IGL’ షో చుట్టూ తలెత్తిన వివాదాల కారణంగా ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఈ ఏడాది రీఎంట్రీలో మరింత ఉత్సాహంతో దూసుకుపోతూ ఏకంగా వరల్డ్ రికార్డు నెలకొల్పడం విశేషం.