షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 28 నవం 2026, 9:11 సా.
ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలో ఘనంగా దీక్షా దివస్‌

Truth into the light
ప్రచురణ తేదీ: 28 నవం 2026, 9:11 సా. రచన: One News Desk
6 వీక్షణలు 0 వ్యాఖ్యలు
ఆస్ట్రేలియాలో ఘనంగా దీక్షా దివస్‌
  • ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్న ప్రవాస తెలంగాణ బిడ్డలు
  • కరీంనగర్ సభ పోస్టర్ ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా డా. హరి రమాదేవి

దిశ, తెలంగాణ బ్యూరో: ఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్‌ 29న బీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్‌ సీనియర్‌ నాయకురాలు డా. హరి రమాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్‌ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ బైరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్‌ 29కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటిచెప్పిన కీలక ఘట్టమని పేర్కొన్నారు. డా. హరి రమాదేవి మాట్లాడుతూ.. కేసీఆర్‌ దీక్షతో తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైందని, రాష్ట్ర సాధనలో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, యువత, ప్రజాసంఘాల పాత్ర కీలకమని గుర్తుచేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకోవాలని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని హరి రమాదేవి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర మరువలేనిదని, ఆస్ట్రేలియాలో ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్న అనిల్‌ బైరెడ్డి బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా నవంబర్‌ 29న కరీంనగర్‌లో కేటీఆర్‌ ముఖ్య అతిథిగా జరగనున్న దీక్షా దివస్‌ సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిస్తూ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి, రమేష్ బాబు హరి, సత్య గుండా, రవీందర్ చుక్క, రాహుల్ నాడిదే, దీపక్ హరి, ప్రవీణ్, పవన్ రెడ్డి, నవీన్, కుల్విందర్ బజ్వా, శ్యామ్ లింగంపల్లి, రఘు, శిరీష, దీప్తి, సతీష్ మాచర్ల, కవల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

#ఆస్ట్రేలియా
ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్న ప్రవాస తెలంగాణ బిడ్డలు కరీంనగర్ సభ పోస్టర్ ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా డా. హరి రమాదేవి దిశ, తెలంగాణ బ్యూరో: ఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో…