షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 28 నవం 2026, 7:29 సా.
బ్యాంకింగ్

Big Financial Rules 2026 : డిసెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ వరకు రాబోయే అతిపెద్ద ఆర్థిక మార్పులివే..!

Truth into the light
ప్రచురణ తేదీ: 28 నవం 2026, 7:29 సా. రచన: One News Desk
9 వీక్షణలు 0 వ్యాఖ్యలు
Big Financial Rules 2026 : డిసెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ వరకు రాబోయే అతిపెద్ద ఆర్థిక మార్పులివే..!
  • డిసెంబర్ 1 నుంచి కొత్త ఆర్థిక రూల్స్..
  • మీ జేబుపై ఎంత భారం పడుతుందో తెలుసా?
  • క్రెడిట్ కార్డు వాడేవారికి అదనపు ఛార్జీలు..
  • సామాన్యులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే

Big Financial Rules December 2026 : డిసెంబర్ 1 నుంచి మీ డబ్బు లెక్కలు మారబోతున్నాయా? కొత్త నెలలోకి అడుగుపెడుతున్న వేళ సామాన్యుల జేబుపై ప్రభావం చూపించే పలు ఆర్థిక మార్పులు తెరపైకి వస్తున్నాయి.

క్రెడిట్ కార్డు ఛార్జీల నుంచి బ్యాంకింగ్ నిబంధనలు, పెట్టుబడుల మార్జిన్ రూల్స్, ఆదాయపు పన్ను గడువుల వరకు కీలక అప్‌డేట్స్ రానున్నాయి. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు ఉన్నవారు, క్రెడిట్ కార్డులు వాడేవారు, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారు ఈ విషయాలపై ఓ కన్నేయాలి.. సామాన్యుల జేబుపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

1. క్రెడిట్ కార్డు వాడేవారికి అదనపు ఛార్జీలు :
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. నిర్దిష్ట రవాణా లావాదేవీలు రూ.30 వేల పరిమితి దాటితే ఒక శాతం ఫీజుతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఒక బిల్లింగ్ సైకిల్‌లో ఇంధన ఖర్చు రూ.50 వేలు దాటితే మొత్తం ఫ్యూయల్ ఖర్చుపై ఒక శాతం ఛార్జీ పడుతుంది..

2. కమోడిటీ ట్రేడర్లకు కొత్త మార్జిన్ రూల్స్ :
సెబీ తీసుకొస్తున్న మార్పులతో కమోడిటీ ట్రేడింగ్ చేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ధరల్లో ఒడిదొడుకులను బట్టి 6, 8, 10 శాతం మార్జిన్ నిబంధనలు అమలులోకి రానున్నాయి.

3. ఐసీఐసీఐ ఎన్ఆర్ఐ ఖాతాల ఛార్జీలు :
ఎన్ఆర్ఐ సేవింగ్స్ ఖాతాదారులకు నగదు లావాదేవీలపై అదనపు భారం పడనుంది. ఉచిత పరిమితి దాటిన ప్రతి రూ.1,000కు రూ.4 ఛార్జీ, కనీసం రూ.150 ఫీజు వర్తిస్తుంది. నెలలో రెండో, మూడో ఈసీఎస్ పేమెంట్ ఫెయిలైతే ఒక్కోసారి రూ.550 పెనాల్టీ పడుతుంది..

4. ఆర్బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం :
డిసెంబర్ 4న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం జరగనుంది. రెపో రేటుపై తీసుకునే నిర్ణయం ఆధారంగా హోమ్ లోన్లు, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీలపై ప్రభావం ఉండొచ్చు..

5. పన్ను చెల్లింపుదారులకు కీలక గడువులు :
డిసెంబర్ 15లోపు అర్హులైన వారు మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ కింద కనీసం 75 శాతం పన్ను చెల్లించాలి. డిసెంబర్ 31తో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు గడువు ముగుస్తుంది..

డిసెంబర్ నెలలో వచ్చే ఈ మార్పులను ముందుగానే తెలుసుకుని ఖర్చులు, పెట్టుబడులు, పన్నుల విషయంలో సరైన ప్లానింగ్ వేసుకోవడం బెటర్.. అయితే, అమలులోకి వచ్చే తేదీలు, వర్తించే నిబంధనలను సంబంధిత బ్యాంకులు, అధికారిక సంస్థల ప్రకటనల్లో ఒకసారి చెక్ చేసుకోవాలి..

#బ్యాంకింగ్ #బిజినెస్
డిసెంబర్ 1 నుంచి కొత్త ఆర్థిక రూల్స్.. మీ జేబుపై ఎంత భారం పడుతుందో తెలుసా? క్రెడిట్ కార్డు వాడేవారికి అదనపు ఛార్జీలు.. సామాన్యులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే Big…