షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 28 నవం 2026, 6:10 సా.
క్రైమ్ వార్తలు

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

Truth into the light
ప్రచురణ తేదీ: 28 నవం 2026, 6:10 సా. రచన: One News Desk
7 వీక్షణలు 0 వ్యాఖ్యలు

200 గ్రాముల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్

తొర్రూరు, ఆంధ్రప్రభ :

నిషేధిత గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన తొర్రూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. ఈ వివరాలను శనివారం డివిజన్ కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ కృష్ణ కిషోర్ వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన పెండ్యాల అక్షయ్, హనుమకొండ చరణ్ యువతను మత్తు పదార్థాలకు లోబరుచుకుని సొమ్ము చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి విక్రయాలు జరుపుతున్నారు. ఇటీవల తొర్రూరు ప్రాంతంలో గంజాయి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. తొర్రూరుకు చెందిన అన్నందాస్ నవనీత్, రాయపురం రాజ్‌కుమార్‌లు విక్రయాలపై సమాచారం అందించడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్ పరీక్షల్లో ఇద్దరూ గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. నిందితుల్లో పెండ్యాల అక్షయ్‌పై గతంలో ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం, బీఎన్‌ఎస్ సెక్షన్ 111 కింద కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

గంజాయి కొనుగోలు, విక్రయాలు, సరఫరా, వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ కోరారు. ఈ సమావేశంలో తొర్రూరు సీఐ గణేష్, ఎస్సైలు మహేందర్ రెడ్డి, ఖాదర్ పాషా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

#క్రైమ్వార్తలు
200 గ్రాముల గంజాయి స్వాధీనంవివరాలు వెల్లడించిన తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ తొర్రూరు, ఆంధ్రప్రభ : నిషేధిత గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.…