షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 29 నవం 2026, 12:08 ఉద.
క్రైమ్ వార్తలు

ఏఐతో పెను ముప్పు.. 2027లో ఏఐ ప్రమాదం పెరగొచ్చని హెచ్చరిక..

Truth into the light
ప్రచురణ తేదీ: 29 నవం 2026, 12:08 ఉద. రచన: One News Desk
11 వీక్షణలు 0 వ్యాఖ్యలు
ఏఐతో పెను ముప్పు.. 2027లో ఏఐ ప్రమాదం పెరగొచ్చని హెచ్చరిక..

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఏడాదే ఏఐ ముప్పు పొంచి ఉందని, నియంత్రణ కోల్పోతే మానవాళికి పెను ప్రమాదం తప్పదని అమెరికాకు చెందిన ఎంఈటీఆర్‌ సంస్థ ఏఐ పరిశోధకుడు నికోలా జుర్కోవిక్‌ హెచ్చరించారు. ‘ఎక్స్‌’లో తన కుటుంబానికి రాసిన బహిరంగ లేఖలో, 2027లో కరోనా మహమ్మారి కంటే దారుణమైన పరిస్థితులు ఎదురుకావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నాటికి మనం ప్రాణాలతో ఉంటామో లేదో తెలియదని ఆవేదన చెందారు. ఇప్పటికే ఏఐ వల్ల కొన్ని కంపెనీలు హ్యాకింగ్‌కు గురయ్యాయని, భవిష్యత్తులో పెను ప్రమాదాలకు దారితీయవచ్చని వివరించారు. ఏఐ వ్యవస్థలు మనుషుల నియంత్రణ దాటి కీలక మౌలిక సదుపాయాలపై దాడులకు దిగడం, దురుద్దేశపరులు ఏఐ సాయంతో జీవ ఆయుధాలు తయారు చేయడం, కీలక నిర్ణయాధికారులు యంత్రాలకు అప్పగించడం వల్ల భారీ ప్రాణనష్టం జరగవచ్చని హెచ్చరించారు. ఏఐ వినియోగంపై కఠిన నియమాలు లేకపోతే 2027 నాటికే ఏఐ మనుషుల కంటే తెలివైనదిగా మారి, తనను తాను మెరుగుపరుచుకుంటుందన్నారు. రాబోయే పదేళ్లలో చాలా ఉద్యోగాలు పోవచ్చని అంచనా వేశారు. అందుకే ఇంట్లో రెండు వారాలకు సరిపడా ఆహారం, తాగునీరు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఆగిపోతే వాడటానికి నగదు నిల్వ చేసుకోవాలని కుటుంబానికి సూచించారు.

#క్రైమ్వార్తలు #టెక్నాలజీ
దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఏడాదే ఏఐ ముప్పు పొంచి ఉందని, నియంత్రణ కోల్పోతే మానవాళికి పెను ప్రమాదం తప్పదని అమెరికాకు చెందిన ఎంఈటీఆర్‌ సంస్థ ఏఐ పరిశోధకుడు నికోలా…