షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 29 నవం 2026, 11:51 ఉద.
క్రైమ్

Jharkhand | 13మంది భక్తులు మృతి..

Truth into the light
ప్రచురణ తేదీ: 29 నవం 2026, 11:51 ఉద. రచన: One News Desk
7 వీక్షణలు 0 వ్యాఖ్యలు

Jharkhand | 13మంది భక్తులు మృతి..

ఆలయ దర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన
నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా 13 మంది దుర్మరణం
ఒక్కరే ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స

Jharkhand | రాంచీ, ఆంధ్రప్రభ: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆలయ దర్శనానికి సంతోషంగా బయలుదేరిన భక్తుల ప్రయాణం విషాదాంతమైంది. రామ్‌గఢ్‌ జిల్లాలోని రాంచీ-పాట్నా జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బీహార్‌లోని నలంద జిల్లాకు చెందిన 14 మంది భక్తులు రాజరప్ప ఆలయంలో దర్శనం చేసుకునేందుకు ఎస్‌యూవీలో బయలుదేరారు. ఈ క్రమంలో రామ్‌గఢ్‌ జిల్లా కుజు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పైంకీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అతడిని వెంటనే రామ్‌గఢ్‌ సదర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు ఎస్‌యూవీ పూర్తిగా దెబ్బతినడంతో అందులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మృతులంతా బీహార్‌లోని నలంద జిల్లా జంగరో గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఆలయ దర్శనం కోసం ఒకేసారి బయలుదేరిన 13 మంది ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

#క్రైమ్
Jharkhand | 13మంది భక్తులు మృతి.. ఆలయ దర్శనానికి వెళ్తుండగా దుర్ఘటననలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా 13 మంది దుర్మరణంఒక్కరే ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స Jharkhand |…