షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 29 నవం 2026, 4:24 సా.
విద్య

Two Men Killed in Electric Shock at Medchal | టెంట్ వేస్తుండగా మృత్యుఘోష.. విద్యుదాఘాతంతో ఇద్దరి దుర్మరణం

Truth into the light
ప్రచురణ తేదీ: 29 నవం 2026, 4:24 సా. రచన: One News Desk
6 వీక్షణలు 0 వ్యాఖ్యలు
Two Men Killed in Electric Shock at Medchal | టెంట్ వేస్తుండగా మృత్యుఘోష.. విద్యుదాఘాతంతో ఇద్దరి దుర్మరణం

Two Men Killed in Electric Shock at Medchal | టెంట్ వేస్తుండగా మృత్యుఘోష.. విద్యుదాఘాతంతో ఇద్దరి దుర్మరణం

  • ఎల్లంపేటలో విషాద ఘటన.. టెంట్ ఇనుప పైపులకు తగిలిన విద్యుత్ తీగలు
  • ఆనందంగా జరగాల్సిన వేడుకలో అలుముకున్న విషాదఛాయలు
  • గోపి, బాబు మృతితో కుటుంబాల్లో తీరని శోకం

Two Men Killed in Electric Shock at Medchal | మేడ్చల్, ఆంధ్రప్రభ : ఓ ఇంట్లో శుభకార్యం.. బంధుమిత్రుల రాకతో సందడి నెలకొనాల్సిన వేళ.. టెంట్ ఏర్పాటు పనుల్లో నిమగ్నమైన ఇద్దరు కార్మికుల జీవితాల్లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. మరికొద్ది సేపట్లో వేడుక కోసం సిద్ధం కావాల్సిన ఆ ప్రాంగణం ఒక్కసారిగా మృత్యుఘోషతో నిండిపోయింది. టెంట్ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట పట్టణంలో ఆదివారం జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

టెంట్ ఇనుప పైపులకు తగిలిన విద్యుత్ తీగలు

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లంపేటలోని ఓ నివాసంలో శుభకార్యం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటి ఆవరణలో టెంట్ వేసే పనుల్లో కార్మికులు నిమగ్నమయ్యారు. టెంట్‌కు సంబంధించిన ఇనుప పైపులను పైకి ఎత్తుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలకు అవి తగిలాయి.

దీంతో ఇనుప పైపుల ద్వారా విద్యుత్ సరఫరా కావడంతో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర విద్యుదాఘాతం సంభవించింది. షాక్ తీవ్రతకు వారు కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గడ్డం గోపి, లబండీ బాబు ప్రాణాలు కోల్పోయారు.

ఆనందాల ఇంట్లో అంతులేని విషాదం

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సందడిగా గడవాల్సిన శుభకార్యం వేళ ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ఎల్లంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారన్న సమాచారం తెలియగానే స్థానికులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారిని కలచివేశాయి.

సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

#విద్య #మేడ్చల్
Two Men Killed in Electric Shock at Medchal | టెంట్ వేస్తుండగా మృత్యుఘోష.. విద్యుదాఘాతంతో ఇద్దరి దుర్మరణం ఎల్లంపేటలో విషాద ఘటన.. టెంట్ ఇనుప పైపులకు తగిలిన…