షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 29 నవం 2026, 11:13 సా.
మహిళ

మహిళలను బంధించి.. రూ.3.20 కోట్లు దోచుకెళ్లిన దుండగులు

Truth into the light
ప్రచురణ తేదీ: 29 నవం 2026, 11:13 సా. రచన: One News Desk
8 వీక్షణలు 0 వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :

ముసుగులు ధరించిన నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి ఇద్దరు మహిళలను కట్టేసి రూ.3.20 కోట్ల నగదును దోచుకెళ్లిన ఘటన నగరంలోని మన్సూరాబాద్‌ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. చండీశ్వర కాలనీలో నివసిస్తున్న సమ్మా మానెమ్మ, ఆమె కోడలు మౌనిక ఇంట్లో ఉన్న సమయంలో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో నలుగురు దుండగులు ప్రవేశించారు. మహిళలను అదుపులోకి తీసుకుని చేతులు కట్టేసి, నోటికి టేప్‌ వేసి నగదుతో పరారయ్యారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కొమ్మరవెల్లి సంపత్‌ కుమార్‌రెడ్డి వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు తన బావమరిది కుంభం విజయ్‌కుమార్‌రెడ్డికి రూ.3.20 కోట్ల నగదు ఇచ్చారు. విజయ్‌కుమార్‌రెడ్డి ఆ మొత్తాన్ని బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసి, కుటుంబ సభ్యుడైన నవీన్‌ ఇంట్లో ఉంచారు. ఈ విషయం తెలిసిన దుండగులు నగదును దోచుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కుటుంబ సభ్యులకు తెలిసినవారిపైనే అనుమానం

దుండగులు ఇంట్లో భారీ మొత్తంలో నగదు ఉన్న విషయాన్ని ముందుగానే తెలుసుకుని రావడంతో, ఈ దోపిడీ వెనుక కుటుంబానికి పరిచయమున్న వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళలు కేకలు వేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు కోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

#మహిళ
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ముసుగులు ధరించిన నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి ఇద్దరు మహిళలను కట్టేసి రూ.3.20 కోట్ల నగదును దోచుకెళ్లిన ఘటన నగరంలోని మన్సూరాబాద్‌ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది.…