దిశ, వెబ్‌డెస్క్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC)లో పలువురు నేతలను కార్యదర్శులుగా నియమిస్తూ, మరికొందరికి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విభాగాల బాధ్యతలను అప్పగిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడి కార్యాలయానికి ప్రణవ్ ఝా, గౌరవ్ పాంధీలను నియమించగా..కమ్యూనికేషన్, పబ్లిసిటీ, మీడియా (సోషల్ & డిజిటల్ మీడియాతో కలిపి) విభాగ బాధ్యతలను డాక్టర్ వినీత్ పునియా, రుచిరా చతుర్వేదిలకు అప్పగించారు.
తెలుగు రాష్ట్రాలు: తెలంగాణకు సచిన్ సావంత్, సైమన్ అలెక్స్‌లను ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించగా; ఆంధ్రప్రదేశ్, అండమాన్ & నికోబార్ దీవులకు సెంథమిళ్ అరసు, వి. శంకర్లకు బాధ్యతలు అప్పగించారు.
దక్షిణాది రాష్ట్రాలు: కర్ణాటకకు నెట్టా డిసౌజా, మోహన్ జోషి, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, అడ్వకేట్ ఎస్. శరత్; తమిళనాడు, పుదుచ్చేరిలకు నివేదిత్ అల్వా, జంగా గౌతమ్, వెంకటేశ్వర్; కేరళ, లక్షద్వీప్‌లకు మయూర ఎస్. జయకుమార్, గణేష్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు.
ఉత్తరాది, ఇతర రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్‌కు అభిషేక్ దత్, వరుణ్ చౌదరి, కునాల్ చౌదరి, జగదీష్ చందర్ జాంగిద్, అబ్దుల్ హన్నన్, సంజీవ్ ఆర్య; ఉత్తరాఖండ్‌కు మనోజ్ యాదవ్, సురేందర్ శర్మ, భీమ్ కుమార్; పంజాబ్‌కు హీనా కవారే, రవీంద్ర దాల్వి, సూరజ్ సింగ్ ఠాకూర్, డాక్టర్ రాజ్ కుమార్ మౌర్య; హర్యానాకు దీపక్ రాథోడ్, సునీల్ అహిరే; హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్‌లకు కమల్ కాంత్ శర్మ, డాక్టర్ రాహుల్ రాజ్‌భర్; జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లకు ధీరజ్ గుర్జర్, సుశీల్ కుమార్ పాసి; ఢిల్లీకి డానిష్ అబ్రార్ నియమితులయ్యారు.
పశ్చిమ, మధ్య భారత రాష్ట్రాలు: గుజరాత్‌కు రామకిషన్ ఓఝా, సుభాషిణి యాదవ్, హేమ్ సింగ్ షెకావత్, నరేష్ ఠాకూర్; మహారాష్ట్రకు యు.బి. వెంకటేష్, రెహానా రయాజ్ చిస్తీ, ఎఫ్.హెచ్. జక్కప్పనవర్, యోగేందర్ యోగి; రాజస్థాన్‌కు విశ్వ విజయ్ సింగ్, పోర్లక్ ఖర్తే, డాక్టర్ పాలక్ వర్మ, మనోజ్ బాగ్రీ; మధ్యప్రదేశ్‌కు నీతూ వర్మ సోయిన్, పాల్ భాయ్ అంబాలియా, డాక్టర్ అజయ్ కుమార్ పాశ్వాన్, ఓంవీర్ యాదవ్; ఛత్తీస్‌గఢ్‌కు జితేంద్ర బఘేల్, హర్నామ్ సింగ్; గోవా, దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యూలకు డాక్టర్ అంజలి నింబాల్కర్‌లకు బాధ్యతలు అప్పగించారు.
తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు: బీహార్‌కు ప్రదీప్ నర్వాల్, ప్రొఫెసర్ ప్రకాష్ సోనావానే, మహబూబ్ పాషా; జార్ఖండ్‌కు భూపేంద్ర మరావి, అవనీష్ కాజ్లా; పశ్చిమ బెంగాల్‌కు అబ్దుల్ ఖలీక్, దేబాశిష్ పట్నాయక్, గుంజన్ పటేల్; ఒడిశాకు జెట్టి కుసుమ కుమార్, పూర్ణచంద్ర పాధి; అసోంకు మనోజ్ చౌహాన్, బాబీ భగత్, ఇఫ్తేకర్ అహ్మద్; మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అనిల్ ఎ. థామస్, సుశాంత చక్రవర్తి, జెనాబ్ చందేల్; మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలకు సరితా లైట్ఫ్లాంగ్, అమిత్ బావా సైనీ, దుంగార్ రామ్ గెదార్లను ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించారు.
విభాగాల వారీగా బాధ్యతలు..
జాయింట్ ట్రెజరర్ (ఆస్తులు, ప్రాపర్టీస్) విభాగానికి నీలేష్ పటేల్, నితిన్ కుంభాల్కర్లను నియమించగా; పరిపాలన (అడ్మినిస్ట్రేషన్) విభాగ బాధ్యతలను సుశాంత్ మిశ్రా, మనోజ్ త్యాగిలకు అప్పగించారు. అలాగే శిక్షణ, సందేశ్ విభాగానికి సంతోష్ కోల్కుండ; ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ & విదేశీ వ్యవహారాల విభాగానికి డాక్టర్ ఆరతి కృష్ణ నియమితులయ్యారు. మరోవైపు, ఇప్పటివరకు ఏఐసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులుగా పనిచేసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న అంబా ప్రసాద్, బి.ఎం. సందీప్, చేతన్ చౌహాన్, చిరంజీవ్ రావు, క్రిస్టోఫర్ తిలక్, దేవేంద్ర యాదవ్, దివ్య మదెర్నా, మన్సూర్ అలీ ఖాన్ అందించిన సేవలను పార్టీ అభినందించింది.