దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఇంట తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన మాతృమూర్తి సావిత్రి దేవి (Savitri Devi) కన్నుమూశారు. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం సాయంత్రం ఉత్తరాఖండ్‌లోని తన స్వగ్రామమైన పంచూర్ (Panchur) చేరుకున్నారు. స్వగ్రామానికి చేరుకున్న సీఎం యోగి, తన తల్లి సావిత్రి దేవి పార్థివదేహంపై పూలమాలలు ఉంచి కడసారి నివాళులర్పించారు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే సీఎం యోగి ఆదిత్యనాథ్, తన తల్లి మృతదేహాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి (Emotional) లోనయ్యారు. సీఎం యోగి మాతృమూర్తి మరణం పట్ల పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తల్లి మృతదేహం వద్ద కన్నీటిపర్యంతమైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్