Anirudh Kavya Maran Reception: సంగీత దర్శకుడు అనిరుధ్, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్యా మారన్ వివాహ రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవంబర్ 22, 2026న రెండో రోజు వేడుక జరగగా.. సినీ, క్రికెట్ ప్రముఖులు సందడి చేశారు.
ఈ వేడుకకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యారు. నూతన జంట అనిరుధ్-కావ్యా మారన్‌ను ప్రత్యక్షంగా ఆశీర్వదించారు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోనీ తొలిసారి ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా నిలిచింది.
ఈ వేడుకలోనే నటుడు అజిత్ కుమార్ కూడా పాల్గొన్నారు. దీంతో ‘రెట్ట తల’ అంటూ ఎంఎస్ ధోనీ, అజిత్ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. తల ధోనీ, తల అజిత్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అంతకుముందు అనిరుధ్ బంధువు, సూపర్ స్టార్ రజనీకాంత్ వేడుకకు హాజరయ్యారు. వేదిక వద్దకు వచ్చిన అజిత్ కుమార్‌ను రజనీకాంత్ ఆలింగనం చేసుకుని స్వాగతించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




