Sathya Velugu, 23 నవంబర్ 2026: దిశ, వెబ్ డెస్క్: ప్రకృతి వింతల్లో ఒకటైన అద్భుత ఘటన పక్షి ప్రేమికులను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యచకితులను చేస్తుంది. మణిపూర్ నుంచి బయలుదేరిన ‘అలాంగ్’ (Alang) అనే అమూర్ ఫాల్కన్ (Amur falcon) జాతికి చెందిన చిన్న పక్షి, మధ్యలో ఎక్కడా ఆగకుండా, ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఏకంగా 101 గంటల పాటు నాన్‌స్టాప్‌గా 5,700 కిలోమీటర్లు ప్రయాణించి ఆఫ్రికాలోని సోమాలియా (Somalia) తీరానికి చేరుకుంది. అలాంగ్తో పాటు మణిపూర్ నుంచి బయలుదేరిన మరో అమూర్ ఫాల్కన్ ‘అపాపాంగ్’ (Apapang) కూడా ఇప్పటికే 95 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణించి 4,100 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుని, ఆఫ్రికా దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు అమూర్ ఫాల్కన్ పక్షులు సుమారు 23 దేశాల మీదుగా ప్రయాణించి గత నెలలోనే మణిపూర్‌కు తిరిగి వచ్చాయి. తాజాగా తిరిగి తమ శీతాకాలపు వలస ప్రయాణం లో భాగంగా ఆఫ్రికా బాట పట్టినట్లు శాస్త్రవేత్తలు మీడియాకు తెలిపారు.
మణిపూర్ నుంచి ఆఫ్రికాకు 5,700 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా ఎగిరిన ‘అలాంగ్’ పక్షి