Sathya Velugu, 26 నవంబర్ 2026: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 709 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా, తొలి విడతలో 25,057 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు .
ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రాంరభం కావడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రా ముందు బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 31,614 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
లైవ్ వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.