Sathya Velugu, 29 నవంబర్ 2026: శబరిమల, సంక్రాంతి పండుగ సీజన్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ – కొల్లాం – హైదరాబాద్ మధ్య 8 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. హైదరాబాద్ – కొల్లాం (07193) జనవరి 2,2027వ తేదీ నుండి జనవరి 23వ తేదీ వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. ఇది రాత్రి 23:10 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి.. సోమవారం ఉదయం 07:15 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, ఆలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావెలికర, కాయంకుళం స్టేషన్లలో ఆగుతుంది.
తిరుగు ప్రయాణంలో కొల్లాం – హైదరాబాద్ స్పెషల్(07194) జనవరి 4 నుంచి 25వ తేదీ వరకు ప్రతి సోమవారం ఉదయం 10:55 గంటలకు కొల్లాంలో బయల్దేరి.. మంగళవారం సాయంత్రం 18:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు కాయంకుళం, మావెలికర, చెంగన్నూర్, తిరువల్ల, చంగనస్సేరి, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, ఆలువా, త్రిస్సూర్, పొదనూర్, పాలక్కాడ్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేట, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.
చర్లపల్లి – సంత్రగచ్చి ప్రత్యేక రైలు(07221) జనవరి 5 నుండి 26వ తేదీ వరకు ప్రతి శనివారం నడిపేలా పొడిగించారు తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07222 (సంత్రగచ్చి – చర్లపల్లి) ప్రత్యేక రైలు జనవరి 6 నుండి 27వ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. అలాగే చర్లపల్లి – తిరువణ్ణామలై (07001) ప్రత్యేక రైలు డిసెంబర్ 31 నుండి జనవరి 21 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో 07002 (తిరువణ్ణామలై – చర్లపల్లి) రైలు జనవరి 1 నుండి 22వ తేదీ వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది.