Sathya Velugu, 23 నవంబర్ 2026: దిశ, వెబ్డెస్క్: అడవి ఏనుగుల తరలింపు ప్రతిపాదనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నయనా మోటమ్మ తన పదవికి రాజీనామా సమర్పించారు. వివరాల్లోకి వెళితే.. హాసన్ జిల్లా బేలూరు ప్రాంతంలో సంచరిస్తున్న సుమారు 50 నుంచి 60 అడవి ఏనుగులను చిక్కమగళూరు జిల్లాకు తరలించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మూడిగెరె ఎమ్మెల్యే నయనా మోటమ్మ, ఇందుకు నిరసనగా తన రాజీనామా లేఖను సమర్పించారు. ఏనుగులను చిక్కమగళూరు ప్రాంతానికి తరలించడం వల్ల స్థానిక రైతులకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకవేళ ఆ నిర్ణయం అమలైతే, ఆ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న మనిషి, ఏనుగు మధ్య ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉందని నయనా మోటమ్మ హెచ్చరించారు. అయితే, ఆమె సమర్పించిన రాజీనామా లేఖ నిర్దేశిత ఫార్మాట్లో లేదనే కారణంతో అసెంబ్లీ స్పీకర్ జీఎస్ పాటిల్ దానిని ఇంకా ఆమోదించలేదు. ప్రస్తుతానికి ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.