
ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తాజా ECMWF అంచనాలు సూచిస్తున్నాయి. వేసవి చివరలో ప్రారంభం కానున్న ఎల్ నినో ప్రభావంతో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా వేసవి ఉరుములతో కూడిన వర్షాలు తగ్గే అవకాశం ఉంది, అంతేకాక గత గణాంకాల ప్రకారం 2002 (48.8°C), 2003 (48.7°C), మరియు 2015 (47.6°C)లో విజయవాడలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఎల్ నినో ప్రభావంతోనే సంభవించాయి.
2026 వేసవిలో భారత్‌లో తీవ్ర హీట్‌వేవ్ పరిస్థితులు నమోదయ్యే అవకాశం ఉందని India Meteorological Department హెచ్చరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45°C పైగా నమోదు కావచ్చని అంచనా. తాజా వాతావరణ శాఖ అప్డేట్లు, హీట్ అలర్ట్లు మరియు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.