తాడ్వాయి, ఆంధ్రప్రభ: తాడ్వాయి మండలం బీరెల్లి కామారం సమీపంలో ఆదివారం రాత్రి ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తెలిసిన సమాచారం ప్రకారం.. బంజర నుంచి బీరెల్లి కామారం వైపు వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇరుప సింగయ్య మృతి చెందగా, స్వామి తీవ్రగాయాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న గ్రామస్తులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని జేసీబీ సహాయంతో వారిని బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.