Sathya Velugu, 24 నవంబర్ 2026: దిశ, వెబ్‌డెస్క్: భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్ష పదవికి జరగనున్న తదుపరి ఎన్నికల రేసు నుంచి దిగ్గజ స్ప్రింటర్ పీటీ ఉష తప్పుకున్నారు. తాను మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదని ఇవాళ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఐఓఏ అధ్యక్షురాలిగా ఆమె దాదాపు మూడేళ్ల పదవీకాలానికి తెరపడనుంది. డిసెంబర్ 5న భారత ఒలింపిక్ సంఘం నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించనుంది. అదే రోజుతో పీటీ ఉష పదవీకాలం అధికారికంగా ముగియనుంది.
అయితే, భారత క్రీడా చరిత్రలో ఐఓఏ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా, తొలి ఒలింపియన్‌గా పీటీ ఉష రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె పదవీకాలంలో అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత క్రీడాకారుల ప్రాతినిధ్యం, పరిపాలనాపరమైన సంస్కరణల దిశగా పలు కీలక అడుగులు పడ్డాయి. అయితే, ఇటీవలి కాలంలో కార్యవర్గ సభ్యులతో నెలకొన్న విభేదాలు, పరిపాలనాపరమైన అంశాల నేపథ్యంలో ఆమె మళ్లీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు గాక్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిసెంబర్ 5న జరగనున్న ఎన్నికలు, నూతన కార్యవర్గ నియామకంతో భారత ఒలింపిక్ సంఘంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. తదుపరి అధ్యక్ష పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయనే దానిపై క్రీడా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.