Sathya Velugu, 24 నవంబర్ 2026: దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్నీలో భాగంగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్‌లో ఇండియా-ఎ జట్టు భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. 250 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్‌కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.
బౌలర్లపై వైభవ్ మెరుపు దాడి..
యూఏఈ బౌలర్లపై ఆది నుంచే విరుచుకుపడిన వైభవ్ సూర్యవంశీ కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా తన జోరును కొనసాగిస్తూ మైదానం చుట్టూ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 32 బంతుల్లోనే 16 భారీ సిక్సర్లు, 5 ఫోర్లతో 121 పరుగులు చేసి వేగవంతమైన లిస్ట్-ఎ సెంచరీలలో ఒకటిగా రికార్డు సృష్టించాడు. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఇండియా-ఎ 7.5 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకునే స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టనుంది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్ హర్‌ప్రీత్ సింగ్ భాటియా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 144 బంతులు ఎదుర్కొన్న హర్‌ప్రీత్ 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేసి యూఏఈకి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చివర్లో బాసిల్ హమీద్ (36 బంతుల్లో 36) రాణించడంతో యూఏఈ 250 పరుగుల మార్కుకు చేరువైంది. భారత బౌలర్లలో4 కీలక వికెట్లు, హర్షిత్ రాణా, సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ తీసి యూఏఈని కట్టడి చేశారు.