Sathya Velugu, 28 నవంబర్ 2026: దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. తాజాగా ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఎంట్రీతో చర్చ మరింత వేడెక్కింది. డీలిమిటేషన్ ప్రతిపాదనలను స్వాగతిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ధ్రువ్ రాఠీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య విభేదాల పేరుతో అసలు అంశాన్ని పక్కదారి పట్టించవద్దని, బీజేపీ రాజకీయ ఎజెండాకు మద్దతు ఇస్తున్నారని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు.
కేటీఆర్‌కు ధ్రువ్ రాఠీ ఘాటు కౌంటర్:
కేటీఆర్ పోస్ట్‌పై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య విభేదాలు సృష్టించే ఈ నాటకాన్ని ఆపండి. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలన్న బీజేపీ ఎజెండాకు మీరు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని సమర్థించడమే అంటూ ధ్రువ్ రాఠీ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్:
ఇక ధ్రువ్ రాఠీ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ వివాదంలో ఇరువర్గాలు నువ్వా నేనా అన్నట్లు కామెంట్లతో సిట్యుయేషన్ ను మరింత సీరియస్ లోకి తీసుకువెళ్తున్నాయి. తమిళనాడులో జరిగిన సమావేశంలోనే దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు పెరిగితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశామని, ఇప్పుడు కూడా అదే మాట మీద నిలబడి ఉన్నామని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. 50 శాతం సీట్ల సంఖ్యను పెంచే ప్రతిపాదనను గతంలో కేసీ వేణుగోపాల్ పార్లమెంట్‌లోనే అంగీకరించారని గుర్తు చేస్తుంటే… బీజేపీ, బీఆర్ఎస్ ఇరు పార్టీలు సాగిస్తున్న నాటకాన్ని ఆపాలని కాంగ్రెస్ ఎదురు కౌంటర్లు ఇస్తోంది. ఇస్తుండగా, కాంగ్రెస్ మద్దతుదారులు మాత్రం బీఆర్ఎస్ తీరుపై మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వెన్నెముక లేనట్లు వ్యవహరిస్తూ బీజేపీకి మద్దతుగా మాట్లాడుతోందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.