Sathya Velugu, 29 నవంబర్ 2026: కార్తీక మాసం నడుస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా భక్తులు దీపారాధనలు చేస్తున్నారు. అయితే, ఈ పవిత్ర మాసంలో హైదరాబాద్లోని అడ్డగుట్టలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద వెలిగించిన కార్తీక దీపం 18 ఏళ్ల యువతి సాయి వెంకట సింధు ప్రాణాన్ని బలితీసుకుంది. నవంబర్ 12వ తేదీ రాత్రి, తన ఎస్ఎస్ బొటిక్ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సింధు, గేటు వద్ద వెలుగుతున్న కార్తీక దీపం అనుకోకుండా తన చీరకు అంటుకోవడంతో క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించాయి. కుటుంబ సభ్యులు వెంటనే మంటలను ఆర్పివేశారు కానీ, అప్పటికే ఆమె తీవ్రంగా కాలిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ సింధు కన్నుమూసింది. ఈ హృదయ విదారక ఘటన అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ ప్రాంతంలో విషాదఛాయలను నింపింది. దీపాలు వెలిగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా సింథటిక్ దుస్తులు ధరించినప్పుడు, రాకపోకలు సాగించే దారుల్లో దీపాలు ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: