కర్నూలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..
పూర్తిగా కోలుకోవడంతో రిమాండ్ ఖైదీగా తరలింపు
అనంతపురం ప్రతినిధి, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ను కర్నూలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు తలెత్తడంతో మెరుగైన చికిత్స కోసం అతడిని అనంతపురం నుంచి కర్నూలుకు తరలించిన విషయం తెలిసిందే. రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతున్నట్లు గుర్తించడంతో పోలీసులు అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం హేమంత్ పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో పోలీసులు అతడిని రిమాండ్ ఖైదీగా తిరిగి అనంతపురానికి తరలించారు.