Sathya Velugu, 24 నవంబర్ 2026: Pakistan vs India A: కీలక పరిణామంలో పాకిస్థాన్ A జట్టు ఇండియా A స్టార్లపై ఫిర్యాదు చేసింది. నవంబర్ 22న ముగిసిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మ్యాచ్లో వారి ప్రవర్తనపై పాకిస్థాన్ వైపు నుంచి కంప్లైంట్ నమోదైనట్టు సమ్మా న్యూస్ రిపోర్టు పేర్కొంది. ముఖ్యంగా హర్షిత్ రాణా పేరును పాకిస్థాన్ జట్టు మ్యాచ్ రిఫరీకి సమర్పించింది.
ఎక్కువమంది చదివినది: IND vs PAK: తిలక్ కాదు.. టీమిండియా ఓటమికి ఈ ముగ్గురు అసలైన విలన్లు..!
ఆదివారం జరిగిన ఆ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు ఆ మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. అయితే మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న పలు వేడి ఘటనలకు హర్షిత్ రాణా కేంద్ర బిందువుగా నిలిచాడు. అందుకే అతడితో పాటు ఇతర ఇండియా A స్టార్లపై పాకిస్థాన్ వైపు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
ఈ ఫిర్యాదుపై మ్యాచ్ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..