Sathya Velugu, 28 నవంబర్ 2026: మృతుడి బంధువుల వివరాల కోసం పోలీసుల విజ్ఞప్తి
గుర్తించిన వారు కరీంనగర్ రూరల్ పోలీసులను సంప్రదించాలి
కరీంనగర్, ఆంధ్రప్రభ క్రైం :
ఈ నెల 24న అనారోగ్యంతో అపస్మారక స్థితిలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స పొందుతూ శుక్రవారం అతను మృతి చెందాడు.
మృతుడి ఆనవాళ్లు
మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. అతని శారీరక ఆనవాళ్లు, దుస్తుల ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తించిన వారు, అతని బంధువులు, కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ రూరల్ పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
సంప్రదించాల్సిన వివరాలు:
ఏ. నిరంజన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్ రూరల్. సెల్ నంబర్లు: 8331940590, 8712670764, 9000884443.