దిశ, వెబ్‌డెస్క్: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) కాన్వాయ్‌పై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వడంతో పాటు పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఆకస్మిక దాడితో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల ప్రక్రియ వేళ జరిగిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దాడికి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
స్థానిక సంస్థల నామినేషన్లలో ఉద్రిక్తత.. MP అవినాశ్ రెడ్డి కాన్వాయ్‌పై పెట్రోల్ బాంబు దాడి