రూ.1.50 లక్షల ఆస్తి నష్టం
సదాశివనగర్, ఆంధ్రప్రభ : మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన చినరాముల అనసూయ నివాసంలో శుక్రవారం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని సామగ్రి కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో టీవీ, విద్యుత్ వైర్లు, ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. సుమారు రూ.1.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న రెవెన్యూ సిబ్బంది పంచనామా నిర్వహించారు.