దిశ, వెబ్ డెస్క్: భారత్ సాధిస్తున్న వేగవంతమైన వృద్ధిని ఓర్వలేకనే ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) సమయంలో పాకిస్థాన్‌కు చైనా మిలిటరీ సాయం అందించిందని అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ (US Congress Panel) నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. అమెరికా కూటమి వెలుపల చైనా సైన్యాన్ని ప్రభావితం చేయగల శక్తులలో భారత్ ఉండటమే డ్రాగన్ దేశం ఈ కుట్రలకు పాల్పడటానికి ప్రధాన కారణమని ఆ నివేదిక స్పష్టం చేసింది. భారత్‌ను కట్టడి చేసేందుకు సరిహద్దుల్లో నిరంతరం ఒత్తిడి పెంచడంతో పాటు చైనా పారిశ్రామిక ఆంక్షలను కూడా విధించిందని నివేదిక పేర్కొంది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు చైనా సైనిక సహకారం అందించిందని తెలిపింది. అలాగే చైనా అనుసరిస్తున్న దూకుడు ఎత్తుగడలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమెరికా (US), భారత్ (India) కలిసి పనిచేయాలని యూఎస్ కాంగ్రెస్ ప్యానెల్ నివేదిక పిలుపునిచ్చింది.
సంచలన ప్రకటన: ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సైనిక సాయం