Sathya Velugu, 25 నవంబర్ 2026: దిశ, వెబ్‌డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కొ-కన్వీనర్ సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌కు సంబంధించిన వివాదంపై కేంద్ర విదేశాంగ శాఖ (MEA) స్పష్టత ఇచ్చింది. సంబంధిత చట్ట అమలు సంస్థల నుంచి అందిన నివేదికల ఆధారంగా, సౌరవ్ దాస్ పుట్టిన స్థలానికి సంబంధించిన వివరాలపై 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెన్నైలోని రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం (RPO ఇవాళ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లుగా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇదే అంశంపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియలో దరఖాస్తుదారులు ఖచ్చితమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఏ దశలోనైనా వివరాల్లో వ్యత్యాసాలు కనిపిస్తే, వాస్తవాలను దాచిపెట్టినట్లు అధికారులు చెబితే, తమ వాదనను వినిపించేందుకు దరఖాస్తుదారుకు షోకాజ్ నోటీసు ఇవ్వడం ప్రామాణిక ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. అలాగే, వివరణ సమర్పించే వరకు పాస్‌పోర్ట్‌ను ప్రయాణాలకు ఉపయోగించవద్దని సౌరవ్ దాస్‌కు సూచించినట్లుగా తెలిపారు.
కాగా, లండన్‌లో స్పీచ్ ఇచ్చేందుకు యూకే (UK) వెళ్లకుండా తనను అడ్డుకున్నారని, తన పాస్‌పోర్ట్ వివరాలపై షోకాజ్ నోటీసు పంపడం ద్వారా ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని సౌరవ్ దాస్ ఆరోపించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ నుంచి ఈ కీలక ప్రకటన చేసింది. మరోవైపు, ఆయన సమర్పించిన పత్రాల్లోని తేడాలకు సంబంధించి మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) కూడా దాఖలైనట్లుగా తెలుస్తోంది.